ఆగష్టులో రిలీజైన రెండు తెలుగు సినిమాలు బింబిసార, సీతారామ రెండు సూపర్ హిట్లు గా నిలిచాయి. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో తెరకెక్కిన బింబిసార డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టగా సీతారామం సినిమా కూడా సూపర్ హిట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మన్నలను పొందింది. ఆగష్టు 5న రిలీజై ఒకేరోజు బాక్సాఫీస్ ఫైట్ లో నిలిచిన ఈ రెండు సినిమాలు మరోసారి పోటీకి సిద్ధమవుతున్నాయి.
రెండు సినిమాలకు థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయినట్టే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 9న రెండు సినిమాలు OTT రిలీజ్ అవుతున్నాయి. అమేజాన్ ప్రైం లో సీతారామం సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుండగా అదేరోజు జీ 5లో బింబిసార సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.
థియేట్రికల్ రన్ లో రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు OTTలో కూడా రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ లు కాబట్టి ఓటీటీలో కూడా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయని చెప్పొచ్చు.