ఆగిపోయిన శ‌ర్వానంద్ పెళ్లి… ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేశారుగా…!

యంగ్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న వారిలో శర్వానంద్ ఒక‌రు. అయితే శ‌ర్వానంద్ ఇటీవల తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురైన రక్షిత రెడ్డిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ర‌క్షిత రెడ్డి ఎవ‌రో కాదు ఏపీ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డికి స్వ‌యానా మ‌న‌వ‌రాలు అవుతుంది. వీరి ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పటికి అయిదు నెలలు దాటుతున్నా వారి పెళ్లి విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వైరల్ గా మారాయి.

rakshita reddy: Telugu actor Sharwanand gets engaged to Rakshita Reddy in  Hyderabad. Details here - The Economic Times

అక్కినేని అఖిల్ లాగే శర్వానంద్ కూడా తన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాడంటూ.. శర్వానంద్ సినిమాలు స‌రిగా ఆడ‌డం లేదు… కెరీర్ ప‌రంగా ఇబ్బందుల్లో ఉండ‌డంతో పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేశాడు అంటూ టాక్ వ‌చ్చింది. అలాగే త‌న‌కు కాబోయే భార్య రక్షిత రెడ్డి విదేశాల్లో తన చదువును పూర్తి చేయాలంటూ అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నారంటూ.. ఇలా రకరకాల వార్తలు వైరల్ కావడంతో.. ఈ వార్తలపై శర్వానంద్ టీం క్లారిటీ ఇచ్చారు.

Tollywood star Sharwanand engaged to Rakshita Reddy in Hyderabad ,  Tollywood star, Sharwanand, engagement, Rakshita Reddy, Ram Charan, Aditi  Rao Hydari, movie news

ప్రస్తుతం శ‌ర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో న‌టిస్తున్నాడ‌ని.. ఈ సినిమా పూర్తయ్యాకే శ‌ర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కుతారు అంటూ చెప్పుకొచ్చారు శర్వానంద్ టీం. ఇంతకుముందు లండన్లో 40 రోజులపాటు షూటింగ్ జరిగిందని.. ప్రస్తుతం శర్వానంద్ ఫ్యామిలీ, రక్షిత్ రెడ్డి ఫ్యామిలీ ఇద్దరు ఎప్పటికప్పుడు పెళ్లి గురించి చర్చలు జరుపుకుంటూ నే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. దీంతో శర్వానంద్ పెళ్లి వార్తలపై వస్తున్న పుకార్లు అన్నింటికి ఒకేసారి ఫుల్ స్టాప్ పడింది.