RRR కాదు ఆస్కార్ నామినేషన్స్ లో ఆ సినిమా..!

RRR : రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆస్కార్ కి వెళ్తుందని నానా హడావిడి చేశారు. నెట్ ఫ్లిక్స్ లో కొన్ని వారాలుగా అదే టాప్ లో ఉండటంతో ఆర్.ఆర్.ఆర్ తో తెలుగు సినిమాకు ఆస్కార్ కల నిజమైనట్టే అని భావించారు. అంతేనా ఆర్.ఆర్.ఆర్ లో నటించిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అంటూ కూడా హడావిడి మొదలైంది. తీరా చూస్తే అసలు ఆర్.ఆర్.ఆర్ నామినేషన్స్ కే ఆస్కార్ నామినేట్ అవలేదు.

ఇండియన్ సినిమాల నుంచి RRR సినిమా ఆస్కార్ కి నామినేట్ అవలేదు. ఆర్.ఆర్.ఆర్ అనుకున్న ఆస్కార్ నామినేషన్ లో గుజరీతీ సినిమా చెల్లో షో ఛాన్స్ అందుకుంది. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందని అనుకున్నారు. కానీ ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టి చెల్లో షో సినిమాకు ఆస్కార్ ఎంట్రీ లభించింది.

చెల్లో షో అంటే చివరి ఆట అని అర్ధం. ఈ సినిమాని పాన్ నళిన్ గా పేరు తెచ్చుకున్న నళిన్ కుమార్ దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఇదివరకు కూడా నెళిన్ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్ లను అందుకున్నాయి. అయితే గుజరాతీ సినిమా నామినేషన్స్ కు వెళ్లడంపై రాజకీయ ప్రమేయం ఉందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ వస్తుందని భావించిన తెలుగు ఆడియన్స్ కు ఇది చేదు వార్త అని చెప్పొచ్చు.

Tags: Chello Show, ntr, oscar awards, Oscar Entry, ram charan, RRR