Megastar : చిరంజీవి రాజకీయం.. ఏంటి మెగాస్టార్ ఈ ట్విస్ట్..!

Megastar చిరంజీవి తన సోషల్ మీడియాలో ఒక డైలాగ్ చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న చిరు లేటెస్ట్ గా ఓ స్పెషల్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంతకీ అదేంటి అంటే రాజకీయాలకు నేను దూరమయ్యాను కానీ రాజకీయం నాకు దూరం కాలేదు అని.. ఇంతకీ చిరు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు.. స్పెషల్ గా ఇది సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసినట్టు అని చర్చ మొదలైంది. పాలిటిక్స్ మన వల్ల కాదని అక్కడ కథ ముగించుకుని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.

అలాంటి చిరంజీవి మళ్లీ తన నోటి వెంట రాజకీయ ప్రస్థావన తీసుకురావడం ఏంటని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఇది చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ అని అందరు అనుకుంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో Megastar చిరు పొలిటీషియన్ గా నటిస్తున్నారు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.

మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. అక్టోబర్ 5 దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా నాగార్జున ది ఘోస్ట్ కూడా రేసులో ఉంది.

Tags: chiru, godfather, Godfather movie, Megastar Chiranjeevi, political, Salman Khan, Tollywood