జ‌గ‌న్ బ‌తిమిలాడినా ఆ టీడీపీ ఎమ్మెల్యేపై పోటీకి వైసీపీకి క్యాండెట్టే దొర‌క‌ట్లేదు…!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరి విషయంలో అయినా పంతం పట్టారంటే వారి అంతు చూసేవరకు నిద్ర పోరు. స్వపక్షంలో అయినా విపక్షంలో అయినా జగన్ కన్ను పడిందంటే చాలు అంతే..! జగన్ ఒకరిని ఇష్టపడితే ఎవరేం అనుకున్నా వారిని తీసుకెళ్లి అందలం ఎక్కించేస్తారు. అలాగే ఎవరిని అయినా ఇష్టపడకపోతే కనీసం వాళ్లకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. వైసీపీలోనే చాలామంది జగన్ అపాయింట్మెంట్ కోసం మూడు నాలుగు సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

What choice is left with Gottipati Ravi Kumar now? - TeluguBulletin.com

ఇక ప్రతిపక్ష పార్టీల్లో అసెంబ్లీలో బయట తనను టార్గెట్ చేసే కొందరి నేతలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని జగన్ కసితో ఉన్నారు. అసలు జగన్ దెబ్బకు గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన మహామహులు అందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. జగన్ టార్గెట్ చేసిన టిడిపి నేతలు చాలామంది ఓడిపోయారు. అయితే కొందరు మాత్రం తీవ్రమైన వ్యతిరేక గాలులను తట్టుకుని కూడా సగర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. జగన్ గట్టిగా టార్గెట్ చేసినా గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒకరు.

Ongole: Karanam Balaram, son likely to join YSRCP soon

2014లో గొట్టిపాటి వైసిపి నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే జగన్తో ఆయనకు ఎక్కడో తేడా వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గొట్టిపాటి నేరుగా జగన్ దగ్గరికి వెళ్లి పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కావాలని అడిగార‌ట‌. నేను నీకు ఎందుకు మంత్రి పదవి ఇస్తాను మీ కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని ఉన్నాడు కదా నీకు మంత్రి పదవి లేదు అని చెప్పేసారట. దీంతో రవి హర్ట్ అయ్యారు.. టిడిపిలోకి జంప్ చేసేసారు. ఎలాగైనా రవిని ఓడించాలని జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి తమ కుటుంబంతో పరిచయాలు ఉన్న సీనియర్ నేత బాచిన‌ చెంచు గరటయ్యను అక్కడ రంగంలోకి దింపారు.

Mining department officials gave a huge shock to Addanki MLA Gottipati -  TeluguBulletin.com

అయినా రవి 14 వేల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అద్దంకిలో రవిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. రవి మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గ‌ర‌ట‌య్య కుమారుడు కృష్ణ చైతన్య అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో రవిని ఢీకొట్టే బలమైన ప్రత్యర్థి కృష్ణ చైతన్య అవుతారా ? అంటే వైసిపి వాళ్ళకి నమ్మకం లేదు. కృష్ణ చైతన్య పై నమ్మకం లేక జగన్ కరణం బలరాం లేదా ఆయన తనయుడు కరణం వెంకటేష్‌ను అక్కడ పోటీచేయమని అడుగుతున్నారు. అయితే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అద్దంకి అంటేనే ఇష్టపడటం లేదు తమకు చీరాల కావాలని పట్టుబడుతున్నారు.

అద్దంకి నియోజకవర్గం, అద్దంకి... - Krishna Chaitanya Bachina | Facebook

అందుకే జగన్ ఫ్యామిలీకి చీరాల సీటు కేటాయించి.. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను పరుచూరు ఇన్చార్జిగా నియమించారు. మధ్యలో ఒకసారి మాజీ మంత్రి ప్రస్తుత వైసిపి నేత సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ బాబును సైతం అద్దంకిలో పోటీ చేయమని అడిగితే ఆ కుటుంబం కూడా చేతులు ఎత్తేసింది. అసలు గత ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును సైతం అద్దంకిలో పోటీ చేయమని అడగగా తాను అక్కడ పోటీ చేయనని.. తన గుంటూరు ఎంపీ సీటు కావాలని అడిగానని చెప్పిన సంగతి తెలిసిందే.

 

అద్దంకిలో పోటీ చేయను అన్నందుకే తనను పార్టీ నుంచి బయటికి పంపేశారని శేషగిరిరావు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇలా రవిని గురించి ఎందుకు జగన్ ఎన్ని ఎత్తులు వేస్తున్నా అసలు వైసీపీ నుంచి అక్కడ పోటీ చేసింది ఎవరు ఇష్టపడటం లేదంటే అద్దంకిలో రవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు వరుస విజయాలు సాధిస్తున్న గొట్టిపాటి రవికుమార్ 2024 ఎన్నికల్లో వరుసగా ఐదో విజయం కోసం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, viral news, YS Jagan, ysrcp