Keerthi Suresh : కీర్తి సురేష్ అలాంటి పాత్రకి ఓకే చెప్పిందా..?

మళయాళ భామ కీర్తి సురేష్ మరో ఎక్స్ పెరిమెంట్ చేస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ (Keerthi Suresh) మహానటితో జాతీయ అవార్డ్ ని సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ తెలుగులో నానితో దసరా మూవీ చేస్తుంది. మరోపక్క తమిళంలో జయం రవి హీరోగా ఒక సినిమాకు సైన్ చేసింది.

ఆంటోని డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ పోలీస్ పాత్రలో కనిపిస్తుందట. కీర్తి సురేష్ (Keerthi Suresh) ఇదివరకు సాని కాయుధం సినిమాలో కొద్దిసేపు పోలీస్ గా కనిపించింది. ఈసారి జయం రవి సినిమాలో పూర్తి స్థాయిలో పోలీస్ పాత్ర చేస్తుందట. ఈ పాత్రలో కీర్తి సురేష్ కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఈమధ్య గ్లామర్ విషయంలో కూడా నెక్స్ట్ స్టెప్ వేసిన కీర్తి సురేష్ ఇక మీదట స్కిన్ షో చేసేందుకు కూడా ఓకే అనేస్తుంది. మరి కీర్తి సురేష్ చేస్తున్న ఈ అటెంప్ట్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags: Antony, Jayam Ravi, Keerthi, Keerthi Suresh, Keerthy Suresh, Kollywood