Nitin : నితిన్ కి దెబ్బేసిన మాచర్ల..!

లవర్ బోయ్ నితిన్ (Nitin) హీరోగా నూతన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మాచర్లలో రాజకీయ వ్యవస్థని మార్చే కలక్టర్ గా నితిన్ ఈ సినిమాలో మాస్ హీరోగా నటించాడు. అయితే నేడు రిలీజైన ఈ సినిమాకు డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కథ, కథనం అంతా రొటీన్ అనేస్తున్నారు ఆడియెన్స్.

సినిమా అంతా కూడా పాత చింతకాయ పచ్చడిలానే ఉందని అంటున్నారు. నితిన్ (Nitin) మాస్ అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఇలాంటి షాకే తగులుతుంది. వరుసగా మాస్ సినిమాలు చేసి నితిన్ బాక్సాఫీస్ దగ్గర వరుస ఫ్లాపులు అందుకున్నాడు. తనని లవర్ బోయ్ గానే చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు అని చెప్పి ఇష్క్ తో తన రూట్ మాచాడు. మళ్లీ ఇన్నాళ్లకు నితిన్ మాచర్ల తో మాస్ అటెంప్ట్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా నితిన్ ని నిరాశపరచింది.

ఈ సినిమాని సొంత బ్యానర్ లో తెరకెక్కించారు. దర్శకుడు నితిన్ కి ఫ్రెండే అవడంతో కావాల్సినంత ఖర్చు పెట్టించాడు. మొత్తానికి సినిమా రిజల్ట్ చూసి షాక్ అవుతున్నారు

Tags: Krithi Shetty, Macharla Niyojakavargam, Nitin, Nitin Movie, Tollywood