Krithi Shetty : బేబమ్మ ఖాతాలో మరో ఫెయిల్యూర్.. బ్యాడ్ టైం మొదలైనట్టే..!

ఉప్పెన హిట్ పడగానే వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో వాటినన్నిటిని ఓకే చెప్పింది కృతి శెట్టి (Krithi Shetty) అయితే ఉప్పెన తర్వాత రెండు సినిమాలు హిట్ అయినా తర్వాత సినిమాలు మాత్రం అమ్మడికి నిరాశ కలిగించాయి. రీసెంట్ గా వచ్చిన రామ్ ది వారియర్ సినిమా రిజల్ట్ షాక్ తగలగా లేటెస్ట్ గా నేడు రిలీజైన నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా కృతి శెట్టి ఖాతాలో మరో ఫెయిల్యూర్ పడేలా చేసింది.

క్రేజ్ ఉన్నప్పుడు ఆఫర్లు రావడం సహజమే కానీ వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఆలోచించాలి. లేదంటే ఇలా ఫ్లాపులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక హీరోయిన్ కి వరుస ఫ్లాపులు పడితే ఆమెపై ఓ ముద్ర వేస్తారు. ఓపెనింగ్ సినిమాతో పాటుగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న కృతి శెట్టి (Krithi Shetty) వరుసగా రెండు వెంట వెంట ఫ్లాపులు కొట్టడంతో అమ్మడి కెరియర్ సందిగ్ధంలో పడినట్టు అయ్యింది.

ఇక తన నెక్స్ట్ సినిమా సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేస్తుంది. ఆ సినిమా కూడా రిజల్ట్ తేడా కొడితే మాత్రం బేబమ్మ బ్యాడ్ లక్ మొదలైనట్టే అని చెప్పొచ్చు. మరి ఇక మీదట కథల విషయంలో పాత్రల విషయంలో అమ్మడు కాస్త అలర్ట్ గా ఉంటే మంచిదని లేదంటే కొన్నాళ్లకే కెరియర్ ముగించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

 

Tags: Bebamma, Krithi Shetty, Macharla Niyojaka Vargam, Nitin, Tollywood, Uppena