Kalyan Ram : బింబిసార వారం రోజుల కలక్షన్స్.. కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ విధ్వంసం..!

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) హీరోగా నూతన దర్శకుడు వశిష్ట డైరక్షన్ లో వచ్చిన సినిమా బింబిసార. ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన బింబిసార సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు వసూళ్లతో కూడా అదరగొట్టింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఎప్పుడూ లేనంత విధంగా బింబిసార కలక్షన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా వారం రోజుల్లో 25.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ ని హీరోగా మరో రేంజ్ కి తీసుకెళ్లుందని చెప్పొచ్చు. ఏ హీరోకైనా కెరియర్ లో స్టాండర్డ్ అవడానికి ఒక సినిమా పడాల్సి ఉంటుంది. అంతకుముందు హిట్ సినిమాలు ఉన్నా ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి ఈ బింబిసార హిట్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా వారం రోజుల్లోనే అందరికి లాభాలు తెచ్చి పెట్టింది.

సినిమాని 15 కోట్ల థియేట్రిక రైట్స్ కి అమ్మేశారు. ఫుల్ రన్ లో డబుల్ ప్రాఫిట్ అందుకునే అవకాశం ఉంటుంది. మొదటివారం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న Kalyan Ram బింబిసార సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కెరియర్ బెస్ట్ హిట్ అందుకుంటాడని చెప్పొచ్చు.

Tags: Bimbisara, Bimbisara Collections, Boxoffice, Kalyan Ram, NTR Arts, Tollywood, Vashishta