భీష్మ చిత్ర‌ బృందానికి భై చెప్పిన ర‌ష్మిక‌

భీష్మ చిత్ర బృందానికి అందులోని హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న వీడ్కోలు చెప్పింద‌ట‌. సీతార బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మాణ సార‌థ్యంలో, చ‌లో మూవీ ఫేమ్ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌ణిశ‌ర్మ కుమారుడు మ‌హ‌తిసాగ‌ర్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించి వాట్ ఏ బ్యూటీ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేయ‌గా ఆడియ‌న్స్ నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తున్న‌ది. ఆ పాట‌లో నితిన్ స్టెప్పుల‌తో అద‌ర‌గొరిడితే , ర‌ష్మిక త‌న అంద‌చందాల‌తో ఎంతో ఆక‌ట్టుకుంటున్న‌ది. కుమారి 21 ఎఫ్ మూవీ ఫేమ్ హెబ్బా ప‌టేల్ ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రను పోషింస్తుండ‌గా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు న‌టించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా చిత్రం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. చిత్రంలో న‌టించిన పాత్ర‌ధారులు ఒక్కోక్క‌రుగా త‌మ డ‌బ్బింగ్ ప‌నుల‌ను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా త‌న పాత్ర‌కు సంబంధించిన డ‌బ్బింగ్ ప‌నుల‌న్నీ ర‌ష్మిక పూర్తి చేసింద‌ట‌. అది చాలా బాగా వ‌చ్చింద‌ట‌. ఈ నేప‌థ్యంలో  త‌న ప‌నుల‌న్నీ పూర్త‌యి పోవ‌డంతో ఇక సినిమా బృందానికి ర‌ష్మిక బైబై చెప్పింద‌ట‌. గ‌త సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాక‌పోవ‌డంతో నితిన్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌నే పెట్టుకున్నాడ‌ట‌. పూర్తి కామెడీతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం క‌చ్చితంగా విజ‌యవంత‌మై మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డ‌వ‌చ్చ‌ని విశ్వ‌సిస్తున్నాడ‌ట హీరో. మ‌రి ఏమ‌తుందో చూడాలి.

Tags: bheshma, nithin, Rashmika Mandanna, venky kudumula, vennela kishor