టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇప్పుడు పెండ్లి చేసుకోబోతున్నాడనే వార్త చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో హాట్‌టాపీక్‌గా మారింది. చిత్ర పరిశ్రమలో మోస్ ఎలిజిబుల్ బ్యాచులర్‌లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నితిన్‌లు ప్రముఖంగా ఉన్నారు. అయితే హీరో ప్రభాస్ పెళ్ళి గురించి అడితే గత ఐదేండ్ల నుంచి ఇప్పుడు.. అప్పుడు అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు నితిన్ పెండ్లీ పీటలు ఎక్కేందుకు సిద్దమవుతున్నాడు. ఇంతకు నితిన్ పెండ్లి ఎప్పుడు.. ఇది నిజ జీవిత పెండ్లా.. లేక సినిమా పెండ్లా అనే అనుమానాలు రాక మానదు. అందుకే నితిన్ త్వరలో నిజంగా ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
సాదారణంగా సినిమా రంగానికి చెందిన వారు సినిమా రంగానికి చెందిన వారినే పెండ్లి చేసుకుంటారు. ఇక్కడ ఇది సాదారణంగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు నితిన్ పెండ్లి చేసుకుంటుంది సినిమా రంగానికి చెందిన అమ్మాయి కాదని క్లారిటీ ఇచ్చారు. సినిమా రంగానికి సంబంధం లేని సంప్రదాయ రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయితో 15 ఏప్రిల్ 2020 పెండ్లి పీటలెక్కబోతున్నాడనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. అయితే నితిన్ పెండ్లి చేసుకోబోయే వదువు డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే నితిన్ ఇంత సడన్‌గా పెండ్లి చేసుకోవడానికి తల్లిదండ్రుల ప్రోద్భలమే కారణమని ప్రచారం. నితిన్ పెండ్లిని ఘనంగా దుబాయ్‌లో జరిపేందుకు సన్నహాలు చేస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి నితిన్ పెండ్లిని కేవలం కుటుంబ సభ్యుల నడుమ సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని టాక్. ఏదేమైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒకరు పెండ్లి పీటలెక్కబోతున్నారు. మరి నితిన్ ను చూసైనా ప్రభాస్ లాంటి హీరోలు కళ్యాణం చేసుకుంటారో లేదో చూడాలి మరి.