ప్రముఖ నటుడు, కమెడియన్, యాంకర్, ఏపీ అధికార వైఎస్సార్ పార్టీ నాయకుడు అలీ ఇంట విషాదం నెలకొంది. అలీ తల్లి జైతోన్ బీబీ ఈ రోజు మృతి చెందారు. అలీ తల్లి ఈ రోజున రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసారు. ఆమె వయస్సు రీత్యా వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా బాధ పడుతున్నారు. అయితే చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బీబీ చికిత్స పొందుతూ మరణించారు.
అలీ సినిమా షూటింగ్ నిమిత్తం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్ళారు. అక్కడే ఉన్న అలీకి తల్లి మరణ వార్త తెలిసి వెంటనే అక్కడ నుంచి బయలు దేరారు. రాజమండ్రి నుంచి బీబీ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించి హైదరాబాద్‌లోని మణికొండలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. అలీ తమ్ముడు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు తల్లీ మరణంలో అలీ ఇంట విషాదం నెలకొంది.
అలీ స్వగ్రామం రాజమండ్రి. అయితే అక్కడే ఉంటున్న బీబీ అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించేది. అలీ కూడా తన తండ్రి పేరిట సామాజిక, సాంఘీక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తల్లీ మరణంతో అలీ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అలీ తల్లి మృతదేహాన్ని సందర్శించేందుకు సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.