ప‌శ్చిమ‌గోదావ‌రిలో 50 వేల బంప‌ర్ మెజార్టీతో టీడీపీ గెలిచే సీటు ఇదే..!

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. టిడిపి, వైసిపి, జనసేన మూడు పార్టీలు ఎత్తు పైఎత్తులతో ప్రజల్లోకి వెళుతున్నాయి. టిడిపి, వైసిపి రెండు ఇప్పటికే పలు సర్వేల ద్వారా ఏఏ నియోజకవర్గాలలో తమ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి ? ఏ నియోజకవర్గాలలో తమ పార్టీ ఎలా ఉంద‌న్న దానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్టు దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఆ సీటు ఏదో కాదు పాలకొల్లు పాలకొల్లు నుంచి గత రెండు ఎన్నికలలో టిడిపి తరఫున ఆ పార్టీ కీలక నేత నిమ్మల రామానాయుడు వరుసగా ఘనవిజయలు సాధిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికలలో జరిగిన ముక్కోణపు పోటీలో 6000 ఓట్ల మెజార్టీతో గెలిచిన రామానాయుడు.. గత ఎన్నికలలో రాష్ట్రం అంతట జగన్ ప్రభంజనం వీచినా కూడా పాలకొల్లులో వైసిపి అభ్యర్థి పై ఏకంగా 18 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఓవైపు జనసేన నుంచి పోటీ చేసిన గుణ్ణం నాగబాబుకు 31 పైచిలుకు ఓట్లు వచ్చినా కూడా రామానాయుడుకు ఏకంగా 18 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది.

ఈసారి జనసేన – టిడిపి పొత్తులో భాగంగా కచ్చితంగా రామానాయుడు పోటీ చేస్తారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే రామానాయుడు మెజార్టీ ఈసారి 50,000 దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన పాలకొల్లులో రెండోసారి గెలిచిన రామానాయుడు అటు నియోజకవర్గంలో పాటు.. ఇటు రాష్ట్రస్థాయిలో దూసుకుపోతున్నారు.

ఎప్పటికప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. రామానాయుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు అందుకే ఆయనకు ప్రజల మనిషిగా గుర్తింపు ఉంది. విచిత్రం ఏంటంటే రామానాయుడుని ఓడించేందుకు జగన్ పాలకొల్లులో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులను మార్చినా ఆ పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు మరింత దిగజారుతోంది.

జిల్లాలో కీలక పదవులు అన్ని జగన్ పాలకొల్లు నియోజకవర్గానికి కట్టబెడుతున్నా కూడా వైసిపి గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదు. అంటే రామానాయుడు ఎంత ? బలంగా ఉన్నారో తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో రామానాయుడు రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.