నిహారిక మిస్ చేసుకున్న సూప‌ర్ హిట్ సినిమా… అది చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది…!

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల కూతురైన నిహారిక పేరు గ‌త‌ కొంతకాలంగా తెగ వైరల్ అవుతుంది. అయితే ఒక మనసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిహారిక. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా ఆ సినిమాల ద్వారా అంతగా గుర్తింపు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం బ్రేక్ ఇచ్చింది.

Oka Manasu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

కాగా 2020లో జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక చైతన్యకు విడాకులు ఇవ్వ‌బోతుందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ వార్తల‌పై నిహారిక గాని మెగా ఫ్యామిలీ గాని ఇప్పటివరకు స్పందించలేదు. కొంతకాలం యాక్టింగ్ కి కామా పెట్టిన నిహారిక నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇటీవల ఆమె డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

అసలు విషయానికి వస్తే రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించిన నిహారిక ఒక సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంద‌ట‌. ఇంతకీ ఏంటా సినిమా..? అనుకుంటున్నారా.. తిరుమ‌ల‌ కిషోర్ దర్శకత్వంలో.. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ‌. ఈ సినిమాలో మొదటిగా నిహారికనే హీరోయిన్ గా అనుకున్నారట. ఏవో కారణాలతో నిహారిక ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

Nenu Sailaja Movie Release Posters & Wallpapers | Moviegalleri.net

దీంతో చివ‌ర‌కు ఈ క్రేజీ ప్రాజెక్టులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్‌కి అది తొలి సినిమా అయినా సినిమా సూపర్ హిట్ కావడంతో కీర్తి సురేష్ కి మంచి క్రేజ్ వచ్చింది. అక్క‌డ నుంచి ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. ఒక‌వేళ నిహారికి ఈ సినిమా చేసి ఉంటే ఆమె ఈ రోజు ఖ‌చ్చితంగా మంచి స్టార్ హీరోయిన్‌గా ఉండేది.