రామానాయుడు ఆ రోజుల్లో ఆ స్టార్ హీరోయిన్‌పై మనసుపడ్డారా… ఆమె కోసం చేసిన షాకింగ్ ప‌ని ఇదే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నిర్మాతలు ఉండొచ్చు.. కానీ కేవలం కొంతమంది నిర్మాతలు మాత్రమే ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండుపోతారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త నిర్మాతలకు స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తారు. అలాంటి మహనుభావులలో ఒకరు దివంగ‌త‌ శ్రీ రామానాయుడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి ఇలా ఏ భాషలో చూసినా రామానాయుడు సినిమాల ముద్ర ఉండేది. ముఖ్యంగా 1961 -2000 దశకం వరకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతి ఏటా ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చేవి.

ఆయనకు ఈ విషయంలో తన ఇద్దరు తనయులు సురేష్ బాబు, వెంకటేష్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. 1960 – 80వ దశకాల్లో అప్పట్లో స్టార్ హీరోలు అందరితో రామానాయుడు వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్‌లు నిర్మించారు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణతో హిట్ సినిమాలు తీసిన ఘనత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సొంతం. సురేష్ బ్యానర్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

ఆయన బ్యానర్లో వాణిశ్రీ, జయప్రద, శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్లు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. ఈ ముగ్గురు హీరోయిన్లు అంటే రామానాయుడుకు ఎంతో స్పెష‌ల్ అంటారు. అలాగే వాణిశ్రీపై ఆయన మనసు పడ్డారని అప్పట్లో పుకార్లు అయితే బయటకు వచ్చాయి. ఇందులో నిజానిజాలు ఏంటన్నది తెలియదు. కానీ వాణిశ్రీని తన బ్యానర్ లో వచ్చే సినిమాలలో ఎక్కువగా ఆయన రిఫ‌ర్‌ చేసేవారు.

ANR 75 years Sanmanam Press Meet Stills | Moviegalleri.net

ఒక్క వాణిశ్రీ, శోభన్ బాబు కాంబినేషన్లోనే సురేష్ బ్యానర్ లో 11 సినిమాలు వచ్చాయంటే వాణిశ్రీకి రామానాయుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం అవుతోంది. అలా వాణిశ్రీ ఎక్కువగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాగా పాపులర్ అయ్యారు. ఇక రామానాయుడును మీరు బాగా మనసుపడిన హీరోయిన్ ఎవరు ? అని ప్రశ్నిస్తే తన బ్యానర్లో నటించిన సినిమాలలో మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్క హీరోయిన్ పై తాను మనసు పడతానని తెలివిగా ఆన్సర్ ఇచ్చేవారు.