రాత్రులు పబ్ లో జింకి చక.. పగలు వృద్దాశ్రమంలో దండాలు.. ఈ సుప్రీత మహా ముదురేరోయ్ ..!!

సురేఖ వాణి, సుప్రీత ఈ తల్లి కూతుర్ల పేర్ల‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ‌ పేర్లు వైరల్ అవుతూనే ఉంటాయి. సురేఖ వాణి మొదట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ కూతురుతో కలిసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో, మోడరన్ వేరులో రీల్స్ చేస్తూ పాపులర్ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో చాలామంది నెట్టిజన్స్ వీరిద్ద‌రిని ఏదో విధంగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.

తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంది. సుప్రీతతో పాటు సురేఖ వాణి కూడా పబ్లో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది. ఇక సుప్రీత తన బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా పాబ్‌కి వెళ్లి పార్టీలో ఎంజాయ్ చేయడంతో పాటు సుప్రీత మంచి మనసును కూడా చాటుకుంది. తన బర్త్‌డేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో సెలబ్రేట్ చేసుకుంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి వృద్ధాశ్రమానికి వెళ్లి వారితో కాస్త టైం గడిపారు. సుప్రీత తన సోష‌ల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడుతూ అక్కడే కొంచెం సమయాన్ని కేటాయించింది.

ఇక వారి కోసం స్పెషల్ గా ఏమైనా ఫుడ్ తీసుకెళ్ళిందా..? లేదా ఏమైనా డొనేషన్ ఇచ్చిందా..? అన్న విషయాలైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇలా బర్త్డే సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి వారితో కలిసి కాసేపు ఎంజాయ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందంటూ ఆమె వివరించింది. ఎప్పుడు ట్రోల్స్ కి గురయ్యాయి ఈ అమ్మ కూతుళ్ళు ఈ న్యూస్‌తో మ‌రో సారి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అంద‌రితో ప్రశంసల అందుకుంటున్నారు.