బెల్లం నీరు తో ఇన్ని ప్రయోజనాల…. తప్పనిసరిగా తాగాలి…!!

సాధారణంగా ప్రతి ఒక్కరు వంటగదిలో బెల్లం అనేది ఉంటుంది. బెల్లాన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే స్వీట్లు కూడా తయారు చేస్తారు. చాలామంది పంచదార కంటే బెల్లం తో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇష్టపడుతూ ఉంటారు. బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి.

అలాగే శీతాకాలం మన డైట్ లో బెల్లం చేర్చుకుంటే శరీరంలో ఉండే వేడి ఉత్పత్తి అవుతుంది. వేడి నీళ్లలో బెల్లం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఇది నేచురల్ టిప్ కావడంతో ఎవరు భయపడనవసరం లేదు. జీర్ణ వ్యవస్థను వేగంగా చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎక్కువగా పరిష్కరిస్తుంది. బెల్లం లోని పోషకాలు ఆరోగ్య సమస్యలకు బాగా ఉపయోగపడతాయి. బెల్లం నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

బెల్లంలో ఫైబర్ నిండుగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం, విటమిన్లు బి1, బి6 , సీ వంటి కణజాలు ఉంటాయి. కొలెస్ట్రాన్ని తగ్గిస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు నీటిలో మరిగించాలి. 10-15 నిమిషాల పాటు చల్లారాలి. దీనిలో నిమ్మరసం పిండాలి. ఇంకా జీలకర్ర, తేనె వంటి వేసుకుని తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.