ఒక్కసారి హెపటైటిస్- బి వైరస్ ఒంట్లో రావడం ఒంట్లో దీని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్ను డామేజ్ చేస్తుంది. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్త మార్పిడి, సూదులు, తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుంది.
1. పరీక్షల్లో-HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండే వైరల్ లాడ్ 5 లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.
2. ఈ వ్యాధిని నివారించుకోవడానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించే అవకాశం ఉంటుంది.
3. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
4. సిర్రోసిన్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు చాలామంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్సలు చేపించుకోవడం ముఖ్యం.
5. హెపటైటిస్ – బి సోకినవారు అల్కహాల్ ముట్టుకోవద్దు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం.
ఈ వ్యాధి వచ్చిన తర్వాత కంగారు పడే కంటే ముందుగా రాకుండా జాగ్రత్త పడాల్సిన నిబంధనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• హెపటైటిస్,బి సెక్స్ ద్వారా సక్రమించి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోవాలి.
• ఒకసారి టూత్ బ్రెష్ లు, రేజర్లు, మెయిల్ కట్టర్ వంటివి మరొకరు వాడొద్దు. బయట సెలూన్లో కూడా కచ్చితంగా కొత్త బ్రేడు వాడేలా చూడాలి.
• ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరి కు ఉపయోగించొద్దు. డిస్పోజల్ సూదులు, సిరంజిలు వాడటం ఉత్తమం.
• చెప్పులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్టు వేపించుకోవడం ఇవి ఒక్కసారి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
• రక్తం ఎక్కించేటప్పుడు, రక్తం ఇచ్చేటప్పుడు పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించి చాలా జాగ్రత్తగా ఉండాలి.
పెళ్లి చేసుకోవచ్చా?
టిక్కలున్నాయి కాబట్టి హెపటైటిస్, బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి వారి అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటిస్, బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చినవాళ్లు తప్పించి మిగతా అందరూ పిల్లలను కూడా కనొచ్చు.