Harish Shankar : హీరోయిన్లు అందరు డైరక్టర్స్ ని ప్రేమించాలి.. ఇదేం కామెంట్ హరీష్ శంకరా..!

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో సుధీర్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. డైరక్టర్ అయిన హీరో డాక్టర్ అయిన ఆమెని హీరోయిన్ గా ఎలా చూపించాడు.. ఆమె గురించి ఏం చెప్పాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో కృతి శెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని కామెంట్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈవెంట్ కి ముగ్గురు హీరోలు, ఐదుగురు దర్శకులు గెస్ట్ లుగా వచ్చారు. డైరక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని. హీరోయిన్లు డైరక్టర్లని ప్రేమిస్తే బాగుంటుందని.. అందరు హీరోయిన్స్ ఇలా చేయాలని ఆయన అనేశాడు. ఈ కామెంట్ హరీష్ శంకర్ కామెడీగానే అన్నా సరే ఓ టాప్ హీరోయిన్ ని తన సినిమాలో రిపీట్ చేస్తూ ఆమె ప్రేమని పొందాలనే ఆలోచనతో హరీష్ శంకర్ ఈ కామెంట్ అన్నాడని కొందరి టాక్.

ఏది ఏమైనా సరే హరీష్ (Harish Shankar) కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీతో ఏ.టి.ఎం అనే వెబ్ సీరీస్ చేస్తున్నారు. ఆ వెబ్ సీరీస్ కి ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించారు. నిర్మాణంలో కూడా భాగం అవుతున్నట్టు తెలుస్తుంది.

Tags: AAMC Event, Harish Shankar, Indraganti Mohanakrishna, Krithi Shetty, Sudheer Babu