వైసీపీ లేడీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఈ ముగ్గురు త‌ప్పా అంద‌రూ ఓట‌మే…!

గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలంతా ఈ సారి ఎన్నికల్లో ఓటమి దిశగా వెళుతున్నారా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తుంటే అవుననే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు దాదాపు జగన్ వేవ్ లోనే గెలిచారు. రోజా, సుచరిత లాంటి వారికి సొంత ఇమేజ్ ఉంది గాని మిగిలిన వారికి పెద్దగా సొంత ఇమేజ్ లేదు. దీంతో వారు జగన్ ఇమేజ్ పైనే గెలిచారు.

YSRCP MLA Viswasarayi Kalavathi on elephants issue in Palakonda  constituency || Assembly Day 7 - YouTube

అయితే ఈ సారి జగన్ ఇమేజ్ తగ్గుతుంది..అటు మహిళా ఎమ్మెల్యేలు సొంత బలం పెంచుకోలేదు. పైగా వ్యతిరేకత పెంచుకున్నారు. దీంతో ఈ సారి మహిళా ఎమ్మెల్యేలకు గెలుపు దాదాపు కష్టమయ్యేలా ఉంది. అలా ఓటమి దిశగా వెళుతున్న వారిలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముందు ఉన్నారు. లేటెస్ట్ సర్వేలో ఈమె నెక్స్ట్ గెలవడం కష్టమని తేలింది. కానీ పాలకొండలో కళావతికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది.

All Tribes Thankful To CM YS Jagan Says Paderu MLA Bhagya Laxmi - Sakshi

అటు పాడేరులో భాగ్యలక్ష్మీకి, రంపచోడవరంలో ధనలక్ష్మీకి గెలుపు ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మూడు స్థానాలు గిరిజన ప్రాంతాలు..ఈ ప్రాంతాల్లో జగన్ ని అభిమానించే వారు ఎక్కువ. అందుకే ఆ మూడుచోట్ల వైసీపీ గెలుపుకు ఛాన్స్ కనిపిస్తుంది. ఇటు కురుపాంలో పుష్పశ్రీ వాణి ఈ సారి గెలవడం అంత ఈజీ కాదని తేలింది. అటు సొంత కుటుంబంలోనే ఆమెకు యాంటీ వ‌ర్గం ఎక్కువైంది.

MLA Undavalli Sridevi stages midnight protest

ఇక కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత ఓటమి అంచున ఉన్నారు. అటు తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి గెలవడం జరిగే పని కాదు. ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత పరిస్థితి పర్లేదు..కానీ టి‌డి‌పి-జనసేన కలిస్తే సుచరితకు చెక్ తప్పదు. చిలకలూరిపేటలో విడదల రజిని, నగరిలో రోజా, కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్, పత్తికొండలో శ్రీదేవి…వీరు కూడా గెలవడం దాదాపు కష్టమే. ఓటమి దిశగా వెళుతున్నారని సర్వేలు స్పష్టం చేశాయి. అంటే ముగ్గురు, నలుగురు తప్ప మిగిలిన మహిళా ఎమ్మెల్యేలు ఓటమి దిశగానే వెళుతున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp