టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డిగా వచ్చి సక్సెస్ అందుకున్నారు. రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఈ సినిమాల తర్వాత చిరు భోళాశంకర్, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలు చేశారు. భోళా శంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కింది.
కోలీవుడ్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ ఈ చిత్రం. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కొన్ని సీన్స్ తో అలరించిన ఆడియన్స్ మాత్రం అన్ సాటిస్ఫైడ్ అంటున్నారు. మెహర్ రమేష్ కి చిరు ఇచ్చిన ఛాన్స్ ని మిస్ యూస్ చేసుకున్నాడని తెలుస్తుంది. అయితే చిరు ఈ సినిమానే కాదు ఈ మధ్య కథల విషయంలో చాలా కన్ఫ్యూజ్‌గా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య ముందు వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు కూడా చిరుకి నిరాశ మిగిల్చాయి.
చిరు సినిమా అంటే మెగా ఫాన్స్ లో ఒక రకమైన జోష్ వస్తుంది.. కానీ సినిమా కథల్లో కొత్తదనం లేకపోవడం వల్ల సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. భోళా శంకర్ లో చిరంజీవి మార్క్ కనిపించేలా చేసిన మిగతా యాస్పిక్ట్స్ అన్ని సినిమాని దెబ్బతీసాయి. ఇక మరో పక్క బాలయ్య మాత్రం కొత్త కథలతో కొత్త క్యారెక్టరైజేషన్‌తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరిలో కూడా బాలయ్య డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.
రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో మరింత ఎక్సైట్మెంట్ పెంచింది. ఆఖండ, వీర సింహారెడ్డి చిత్రాలతో హిట్ అందుకున్న బాలయ్య భగవంత్ కేసరితో హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తున్నాడు. కథలు, క్యారెట్రైజేషన్ విషయంలో ఎందుకో చిరంజీవి రొటీన్ గా అనిపిస్తున్నాడు. బాలయ్య మాత్రం కొత్త పాత్రలతో దూసుకుపోతున్నాడు. చిరు తను చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్త పడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్. భోళా శంకర్ రిజల్ట్ తెలిసిపోయింది చిరు తర్వాత చేసే సినిమాల విషయంలో త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతుంది.