Krithi Shetty : కంగ్రాట్స్ రా.. మెగా హీరోకి హీరోయిన్ కామెంట్..!

Krithi Shetty : ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు లేటెస్ట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా బెస్ట్ డిబట్ అవార్డ్ అందుకున్నారు. అయితే ఈ ఇద్దరు స్టేజ్ మీద కలిసి కనిపించగానే ఆడియన్స్ అందరు ఫిదా అయ్యారు. అయితే వైష్ణవ్ తేజ్ అవార్డ్ అందుకున్న కారణంగా అతని ఫోటో షేర్ చేస్తూ కంగ్రాట్స్ రా అని మెసేజ్ పెట్టింది కృతి శెట్టి. మెగా హీరోని రా అనేంత క్లోజ్ నెస్ అంటే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల మధ్య బాండింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఉప్పెన హిట్ తో అరడజనుకి పైగా సినిమాలు చేసిన కృతి శెట్టి వాటిలో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులు అందుకుంది. ఇక వైష్ణవ్ తేజ్ మాత్రం ఉప్పెన తర్వాత మళ్లీ హిట్ ఖాతా తెరవలేదు. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కథల విషయంలో వైష్ణవ్ తేజ్ జాగ్రత్త పడల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలాఉంటే మళ్లీ ఉప్పెన జోడీ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. బుచ్చి బాబు ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమా లేట్ అయితే ఉప్పెన కాంబో పెట్టి మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.

అదే జరిగితే మాత్రం మరోసారి ఈ కాంబో రచ్చ చేసే అవకాశం ఉంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ మరోసారి తెర మీద చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి వీరిద్దరు ఎన్నాళ్లకు మళ్లీ కలిసి నటిస్తారో చూడాలి. కృతి శెట్టి మాత్రం తెలుగుతో పాటుగా తమిళంలో కూడా దూసుకెళ్తుంది.

Tags: Filmfare, Krithi Shetty, Tollywood, Uppena, Vaishnav Tej