Keerti Suresh : కీర్తి సురేష్ మరో కొత్త ప్రయోగం..!

మహానటి కీర్తి సురేష్ (Keerti Suresh) ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటుగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తుంది. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్ ఇక మీదట తను కూడా రెచ్చిపోయేందుకు రెడీ అని హింట్ ఇస్తుంది. అయితే కమర్షియల్ సినిమాల్లో చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైన్ చేస్తుంది. లేటెస్ట్ గా కీర్తి సురేష్ ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

కె.జి.ఎఫ్ ప్రొడక్షన్ హౌజ్ హొంబలే ఫిలింస్ బ్యానర్ లో ఆకాశమే హద్ధు డైరక్టర్ సుధ కొంగర డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerti Suresh) లీడ్ రోల్ చేస్తుంది. ఆకాశమే హద్ధు సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరక్టర్ సుధ కొంగర ఈసారి మరో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈమధ్యనే తమిళంలో చిన్ని సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేష్ సుధ కొంగరతో మరో ప్రయోగానికి సిద్ధమైంది.

Tags: Hombale Films, Keerti Suresh, mahanati, Sudha Kongara, Tollywood