Nayanathara : అమ్మో నయనతార.. దీపిక, అలియాలను కూడా వెనక్కి నెట్టేసిందిగా..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ Nayanathara గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేఎస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ప్రాణం పోసింది. నయనతార సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోల సినిమాలు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. సోలో సినిమాలతోనే 20 నుంచి 30 కోట్ల దాకా వసూళ్లని రాబట్టింది నయనతార. అందుకే ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటుంది.

లేటెస్ట్ గా మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిందట నయనతార. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, అలియా భట్ ల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది నయనతార. జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఓ సినిమాకు గాను నయనతార (Nayanathara) అక్షరాల 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. వాళ్లు కూడా నయన్ అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట.

ఈ సినిమాను నిలేష్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం నయనతార తీసుకుంటున్న రెమ్యునరేషన్ చూసి షాక్ అవుతున్నారు. దీపిక పదుకొనె, అలియా భట్ 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా నయనతార వాళ్లిద్దరికి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తుంది. అయితే ఆ సినిమాకు మాత్రం 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్.

Tags: Alia Bhatt, Deepika Padukone, Nayan, Nayanathara, Nayanathara Remuneration, Tollywood, Zee Studios