మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఎంత గొప్ప నటి అన్నది అందరికి అర్ధమైంది. ఆ సినిమాలో ఆమె నటనకు నేషనల్ అవార్డ్ కూడా వరించింది. అయితే ఈమధ్య ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసి కొద్దిగా నిరాశపరచిన కీర్తి సురేష్ (Keerti Suresh) మహేష్ తో సర్కారు వారి పాట సినిమాతో సత్తా చాటింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లంటూ మరోసారి వార్తలు వస్తున్నాయి.
అంతకుముందు కూడా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా మళ్లీ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని టాక్. ఓ బిజినెస్ మెన్ తో కీర్తి పెళ్లి ఫిక్స్ అయ్యిందట. ఆల్రెడీ అన్నీ మాట్లాడుకున్నారని చెబుతున్నారు. త్వరలోనే కీర్తి సురేష్ (Keerti Suresh) తన పెళ్లి వార్త చెబుతుందని అంటున్నారు. అయితే తను కమిటైన సినిమాలు చేసే వరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారు.
కీర్తి పెళ్లి మ్యాటర్ నిజమే అయితే మాత్రం ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈమధ్య ట్రెండ్ మారింది పెళ్లైన హీరోయిన్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నారు. సో అలా సినిమాలకు దూరం కాకుండా పెళ్లి చేసుకున్నా ఫ్యాన్స్ సంతోషిస్తారని చెప్పొచ్చు.