టాలివుడ్, కోలివుడ్, మాలివుడ్ చిత్రపరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఏండ్లు గడిచినా తన ప్రతిభతో రాణిస్తున్నది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నది. మహిళా ప్రధాన పాత్రలున్న చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నది. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు ఈ భామ అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే ప్రభుదేవ, ఆర్యలతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో నవ్వుల పాలైంది. కొంత ఇమేజ్ డ్యామేజ్ కూడా అయింది. అదీగాక తాజాగా ఈ భామపై నిర్మాతలు కూడా చాలా గుర్రుగా ఉన్నారట. ఏకంగా తమ యూనియన్‌లో ఫిర్యాదు చేసే స్థాయికి చేరిందట వ్యవహారం. మరెందుకు ఈ అమ్మడిపై వారికి కోపం. అంతలా ఏం చేసిందనే కదా మీ డౌటు. అయితే మీరు చదవండి.
నయన్ రోజురోజుకూ ఎలాగయితే తన స్టార్ ఇమేజ్‌ను పెంచుకున్నదో అదే తరహాలో తన పారితోషికాన్ని సైతం భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల మేరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం. అయినప్పటికీ నిర్మాతలు అందుకు అంగీకరించి ఈ భామ అడిగినంత ముట్టజెప్పుతున్నారట. ఇదిలా ఉండగా ఆ పారితోషికంతో పాటు ఆమె ఇతర అవసరాల ఖర్చులే భారంగా మారాయని నిర్మాతలు వాపోతున్నారట. నయనతారకు ప్రత్యేక కేరవాన్, బాడీగార్డ్స్ వేతనాలు, ఆమె ప్రత్యేక మేకప్‌మన్, హెయిర్‌డ్రస్సెర్, వ్యక్తిగత అసిస్టెంట్, కారు డ్రైవర్ వారందరి ఖర్చులను నిర్మాతలే భరించాల్సిన పరిస్థితి ఉందట. వాటికి రోజుకు కనీసం రూ. 60 నుంచి 70 వేలు అవుతున్నాయని సమాచారం. అవిగాక నయనతార సొంత ఖర్చులను నిర్మాతల నుంచే వసూలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. చివరికి తన వెంట వచ్చే ప్రియుడు సరదాల ఖర్చు నిర్మాతలే భరించాల్సివస్తోందని నిర్మాతల మండలిలో జోరుగా చర్చ సాగుతున్నది. ఇదే విషయాన్ని ఇటీవల నిర్మాత రాజన్ ఒక వేదికపై నటి నయనతార పారితషికం గురించి మాట్లాడారు.
ఇకపై నయనతార వంటి స్టార్ హీరోయిన్లు తమ పారితోషికాల నుంచే వారి ఖర్చులను పెట్టుకోవాలనే నిబంధనను విధించాలని ఒత్తిడి నిర్మాతల మండలిపై పెరుగుతున్నట్లు సమాచారం. నిర్మాతలు తీసుకోవాలనుకుంటున్నట మిగతా నటీమణులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. అదేవిధంగా నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బేనంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుటికే అవకాశాలు తగ్గాయని, ఆమెపై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటే కెరీర్ ఇంకా దారుణంగా తయారవుతుందని సినీ వర్గాల మాట. మరి నిర్మాతల ఆరోపణలపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.