Vijay Devarakonda : లైగర్ మూవీ.. బాబోయ్ రెమ్యునరేషన్ లిస్ట్ చూసి షాక్ అవ్వాల్సిందే..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లీడ్ రోల్ లో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఆగష్టు 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. సినిమాలో రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా ఈ మూవీలో భాగమయ్యారు.

ఇక ఈ సినిమా కోసం విజయ్ (Vijay Devarakonda)భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు విజయ్ 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని టాక్. ఆ తర్వాత విజయ్ కన్నా మైక్ టైసన్ కి ఈ సినిమా కోసం భారీగా సంపరించుకున్నారట. ఆయనకే 40 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక హీరోయిన్ అనన్యా పాండేకి 3 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. రమ్యకృష్ణకి కూడా మంచి మొత్తమే అందిందట.

మొత్తానికి హీరో, సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన మైక్ టైసన్ కి మంచి పారితోషికం అందిందని చెప్పొచ్చు. అయితే హీరోయిన్ అనన్యా పాండేకి మాత్రం ఈ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పొచ్చు.

Tags: ananya pandey, Charmy, liger movie, Mike Tyson, puri jagannath, Vijay Devarakonda