గాడ్ ఫాదర్ నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్.. ఎలాగుందంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మాతృకలో మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తోంది. ఆమె భర్తగా సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

సత్య ప్రియ జైదేవ్ గా నయనతార పాత్ర ని పరిచయం చేశారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యమంత్రి కూతురు పాత్రలో నయనతార నటిస్తోంది. చైర్ లో కూర్చుని వచ్చిన ఫ్యాక్స్ ని సీరియస్ గా చదువుతున్నట్లుగా నయనతార కనిపిస్తోంది. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్నట్లు ఈ చిత్ర మేకర్స్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా దసరాకు విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం నెలకొంది. కాగా తాజాగా నయనతార పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మరోసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా దసరా పండుగకు రావడం ఖాయమైంది. ఈ సినిమాతో పాటు అదే రోజున నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ కూడా విడుదల కానుంది.

Tags: chirajeevi, god father movie, Nayanatara, tollywood heroiens, tollywood news