Mokshagna : మోక్షజ్ఞ ఓ సూపర్ లవ్ స్టోరీ.. నందమూరి వారసుడి ఎంట్రీ ఫిక్స్..!

నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Mokshagna ) గురించి ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎప్పటినుంచో రకరకాల వార్తలు వస్తున్నా వాటిల్లో ఏది నిజం కాలేదు. ఇక లేటెస్ట్ గా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మోక్షజ్ఞ ఓ సూపర్ లవ్ స్టోరీతో రాబోతుందని టాక్. ఇంతకీ ఈ సినిమా డైరక్టర్ ఎవరంటే రాహుల్ సంకృత్యన్ అని అంటున్నారు.

ట్యాక్సీవాలా, శ్యాం సింగ రాయ్ సినిమాలతో తన సత్తా చాటిన రాహుల్ ఓ అదిరిపోయే ప్రేమకథ సిద్ధం చేశాడట. ఆల్రెడీ బాలయ్యని కలిసి కథ వినిపించడం కూడా జరిగిందట. బాలకృష్ణ కి కథ బాగా నచ్చేసిందని టాక్. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ హీరో లవ్ స్టోరీతో వస్తే ఎలా అని కొందరు అంటున్నా.. మొదటి సినిమా ఎలా తీసినా వర్క్ అవుట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

Mokshagna తెరంగేట్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ని డైరెక్ట్ చేయడం కోసం డైరక్టర్స్ లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. అందులో క్రిష్, బోయపాటి లాంటి స్టార్ డైరక్టర్స్ కూడా ఉన్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు.. ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది.

Tags: balakrishna, Love Story, Mokshagna, Mokshagna movie, Nandamuri Hero, Nandamuri Mokshagna, NBK, Tollywood