నవీన్ చంద్ర హీరోగా క్రైమ్ థ్రిల్లర్.. అదిరిపోయిన ట్రైలర్..!

అందాల రాక్షసి సినిమాతో తెలుగులో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర. హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు నవీన్. సినిమాలే కాదు ఓటీటీ ల కోసం వరుసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విరాట పర్వం, గని వంటి సినిమాల్లో నటించిన నవీన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు నిర్మించిన పరంపర వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించిన రిపీట్ అనే సినిమాలో నటించాడు నవీన్ చంద్ర. ఈ సినిమా పూర్తిగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

ఇందులో నవీన్ యువ ఐపీఎస్ అధికారిగా నటిస్తున్నాడు. గేమ్ మొదలు పెట్టిన ఫస్ట్ మూవ్ లోనే ఒకడు మనకు చెక్ పెడితే..ఎలా ఉంటుందో అలా ఎదురైంది నాకు ఈ కేసు..ప్రతి స్టెప్ లోనూ నాకు చెక్ పెడుతూ వచ్చాడు.ఒకడు ఆటలో అంత సులభంగా తెలిస్తే మజా ఏముంటుంది..ఒక క్రిమినల్ అయిన వాడే అలా ఆడితే.. ఒక ఐపీఎస్ అయిన నేను ఇంకెలా ఆడాలి. అని ట్రైలర్ లో సాగే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

రిపీట్ సినిమాలో నవీన్ చంద్ర తో పాటు సత్యం రాజేష్, సుదర్శన్ స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 25వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీట్ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న నవీన్ చంద్రకు ఈ సినిమా అయినా హిట్ అందిస్తుందేమో చూడాలి.

Tags: DisneyPlus Hotstar Telugu, naveen chandra, Repeat Trailer