ది ఘోస్ట్ నుంచి మరో ప్రోమో.. అదిరిపోయిన యాక్షన్ సీక్వెన్స్..!

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గరుడవేగ వంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తార్ నాగార్జున తో కూడా అటువంటి నేపథ్యంలోనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ది ఘోస్ట్ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, ప్రోమోలు నాగార్జున ఫ్యాన్స్ ని సప్రైజ్ చేశాయి.

ఇంతకుముందు ఎన్నడూ నటించినటువంటి పాత్రలో నాగార్జున మొదటి సారి కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో విడుదలైంది. తమహగానే పేరుతో విడుదలైన ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నాగార్జున సొంతంగా ఒక పొడవాటి కత్తి ని తయారు చేసుకోవడం, అంతలో అక్కడికి వందలాది మంది పోలీసులు చేరుకోవడం.. వారితో తలపడే యాక్షన్ దృశ్యాలతో ఈ ప్రోమో విడుదల చేశారు.

ప్రోమో చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తోంది. వీడియా చివర్లో ఆగస్టు 25వ తేదీన ది ఘోస్ట్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా నాగార్జున ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.

Tags: akkineni nagarjuna, Bharatt - Saurabh, Praveen Sattaru, The Ghost - Thamahagane Promo