లూసిఫర్ సీక్వెల్ కు ఎంపురాన్ గా టైటిల్ ఫిక్స్..!

మోహన్ లాల్ హీరోగా మలయాళంలో స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మూడేళ్ళ కిందట వచ్చిన లూసిఫర్ సినిమా అక్కడ రికార్డులను కొల్లగొట్టింది. అదే పేరుతోనే తెలుగులో కూడా ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. ఇందులో మోహన్ లాల్ రాజకీయ నాయకుడిగా నటించారు. తన రాజకీయ గురువు అకస్మాత్తుగా చనిపోవడంతో.. ఆ కుటుంబంలో తలెత్తే సమస్యలు పరిష్కరించే స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో మోహన్ లాల్ నటించారు. ఇందులో సెకండ్ హీరోగా, మోహన్ లాల్ అనుచరుడిగా పృథ్వీ రాజ్ నటించాడు. వివేక్ ఒబెరాయ్ మంజు వారియర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు పృథ్వీ రాజ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఎంపురాన్ గా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మాఫియా సంస్థకు అధినేతగా అబ్రహం ఖురేషి అనే పాత్రలో నటించనున్నాడు. మోహన్ లాల్ మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు.. అతనికి పృథ్వీ రాజ్ ఎలా పరిచయమయ్యాడు.. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది.

తెలుగులో లూసిఫర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఇతర పాత్రల్లో నయనతార, సత్యదేవ్ కనిపించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించడంతో ఆ సినిమా కూడా చిరంజీవి చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags: chiranjeevi, lucifer, mohan lal, tollywood gossips, tollywood news