నరేష్ – పవిత్ర ప్రేమకథలో అదిరిపోయే ట్విస్టులు… ఫ‌స్ట్ ప్ర‌పోజ్ చేసింది ఎవ‌రంటే…!

నరేష్ – పవిత్ర గత కొంతకాలంగా ఈ పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ, లివింగ్ రిలేషన్ షిఫ్‌లో ఉన్నారంటూ, పెళ్లి చేసుకోబోతున్నార‌ని ర‌క‌ర‌కాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి వారిద్దరు దీనిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మళ్లీపెళ్లి సినిమా ద్వారా మరింత హైప్ పెంచుతూ వారిద్దరి నిజ జీవితంలో జరిగిన విషయాలన్నీ మూవీ టీజర్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ప్రేక్షకులకు కూడా ఆసక్తి పెరిగింది.

Naresh and Pavitra Lokesh share a passionate kiss in wedding announcement  video. Watch - India Today

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నా నరేష్ – పవిత్ర వారి లవ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విష‌యాలు చెపుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరి లవ్‌స్టోరీలో మొదటి ఎవరు ప్రపోజ్ చేశారు..? అనే క్వశ్చన్ ఎదురయింది. దాంతో నరేష్ తానే మొదటి పవిత్రకు ప్రపోజ్ చేశానని చెప్పుకొచ్చాడు. నరేష్ – పవిత్ర మొదటిసారిగా ఆలయం సినిమా షూటింగ్ టైంలో కలుసుకున్నారట‌.

ఆ సమయంలో హాయ్.. బాయ్.. అన్నట్టుగానే వారి పరిచయం ఉండేదని.. తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ టైంలో మళ్లీ వీరిద్దరూ కలిసి నటించామ‌ని.. ఆ టైంలో పవిత్ర గలగల మాట్లాడడం నాకు బాగా నచ్చేదని.. దాంతో వారిద్దరి మధ్యన స్నేహం బలపడిందని. ఆ తర్వాత సమ్మోహనం మూవీ టైంలో ఆ స్నేహం కాస్త పవిత్రపై నాకు ప్రేమగా మారిందని చెప్పుకొచ్చాడు నరేష్.

Naresh Pavitra Lokesh, వీకే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఓ సినిమా? మెచ్యూర్  లవ్‌స్టోరీ కథతో - actor naresh and pavitra lokesh to act as hero & heroine  - Samayam Telugu

అయితే సమ్మోహనం సినిమా షూటింగ్ పూర్తయి పవిత్ర వెళ్ళిపోతుందన్న సంగతి తెలుసుకున్న నేను పవిత్రను ఆరోజు నైట్ డిన్నర్ కు ఆహ్వానించానని.. డిన్నర్ పూర్తై వెళ్ళిపోయే ముందు పవిత్రకు ఐ లవ్ యు చెప్పానని.. దానికి పవిత్ర కీప్ లవింగ్ మీ అనే సమాధానం ఇచ్చి వెళ్లిపోయిందని.. ఆ సమాధానం ఎలా తీసుకోవాలో తెలియక నాకు కోపం వచ్చిందని న‌రేష్ తెలిపాడు.

తర్వాత రోజు సెట్ నుంచి పవిత్రని పక్కకు తీసుకువెళ్లి సరిగ్గా సమాధానం చెప్పమని అడగగా అప్పుడు కూడా సమాధానం సరిగా రాలేదట‌. చాలా రోజుల త‌ర్వాత కూడా పవిత్ర నుంచి ఐ లవ్ యు అనే రిప్లై రాలేదట‌. తర్వాత కొంతకాలానికి డిసెంబర్ 31 రోజు కేక్, బొకే తీసుకుని పవిత్ర ఇంటికి వెళ్లి విష్ చేసేందుకు వెళ్లాడ‌ట న‌రేష్‌? ఆ రోజు పవిత్ర ఐలవ్యూ అని చెప్పిందని చెప్పుకొచ్చాడు నరేష్. అలా తన లవ్ స్టోరీ కంటిన్యూ అవుతూ వస్తుంది అని సమాధానం ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.