యువ‌గ‌ళంలో లోకేష్ క్రియేట్ చేసిన‌ మ‌రో సంచ‌ల‌నం…!

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో కొన‌సాగుతున్న యాత్రం.. తాజాగా కీల‌క‌మైన మైలురాయికి చేరింది. ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో నేటి నుంచి నారా లోకేష్ పాద‌యాత్ర సాగ‌నుంది. దీంతో యాత‌కు మ‌రింత జోష్ పెరుగుతుంద‌ని.. నారాలోకేష్ వాగ్ధాటికి మ‌రింత ప‌దును పెరుగుతుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి.

Yuva Galam Padayatra: TDP National Secretary Nara Lokesh Interacts With  Farmers - PICS

ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభ‌మైన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 105 రోజులు పూర్తి చేసుకుంది. చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో పూర్తి చేసుకున్న యువ‌గ ళం.. ఆయా జిల్లాల్లో దాదాపు ప్రతి నియోజ‌క‌వ‌ర్గాన్నీ క‌వ‌ర్ చేసింది. అదే స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను కూడా నారా లోకేష్ ట‌చ్ చేశారు. వారి స‌మస్య‌లు విన్నారు. వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

Lokesh lashes out at Jagan on second day of yatra

ఇదేస‌మ‌యంలోవారికి అనేక హామీలు కూడా గుప్పించారు. అయితే.. ఇప్పుడు క‌డ‌ప‌లో అడుగు పెడుతు న్న దానికి.. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన జిల్లాల‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందు కంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి చెందిన నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే నారా లోకేష్ పాద‌యాత్ర చేశారు. కానీ, ఇప్పుడు వైసీపీ అధినేతకు చెందిన జిల్లాలోనే పాద‌యాత్ర చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

Anantapur: Lokesh's Yuva Galam draws overwhelming response

క‌డ‌ప వైసీపీకి బ‌ల‌మైన కంచుకోట‌. ఉన్న ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ నాయ‌కులే విజ‌యం ద‌క్కించు కున్నారు. ఎంపీలు కూడా.. వైసీపీకి అత్యంత కావాల్సిన నాయ‌కులు. దీంతో ఇక్క‌డ నారా లోకేష్ పాద‌యాత్ర ఏ రీతిగా న‌డుస్తుంది.. అనేది ఆస‌క్తిగా మారింది. పైగా.. ఇక్క‌డ ప్ర‌జ‌లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే లోకేష్ ఎంట్రీతోనే ఇక్క‌డ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చాలా వ‌ర్గాలు లోకేష్‌ను క‌లిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఏదేమైనా క‌డ‌ప గ‌డ‌ప‌లో లోకేష్ ఎంట్రీతోనే టీడీపీలో స‌రికొత్త జోష్ అయితే క‌నిపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం.