టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళగిరి నియో జకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇప్పటి వరకు అనేక నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగినప్పటికీ.. ఇప్పుడు మంగళగిరిలో పాదయాత్ర చేస్తుండడం ఖచ్చితంగా నారా లోకేష్‌కు, పార్టీకి కూడా పెద్ద మైలురాయిగా సీనియర్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దరిమిలా.. తరచుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేసి విజయం దక్కించుకోవాలనే ల క్ష్యంతో నారా లోకేష్ ఉన్న విషయం తెలిసిందే. ఎవరు ఎన్ని చెప్పినా.. ఆయన నియోజకవర్గం మార్చుకు నేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన మంగళగిరిలో పోటీ ఖాయం. ఈ క్రమంలో మరింత ఊపు పెంచుకునేలా.. స్థానికంగా ప్రజల్లో సానుభూతి పెరిగేలా.. అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ఇక, ఇప్పుడు పాదయాత్ర ద్వారా మరింతగా మంగళగిరిలో ప్రజల మనసు దోచుకోవాలని.. నారా లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగా కాకుండా.. మంగళగిరి నియోజకవర్గం విష యంలోకి వచ్చేసరికి.. అన్ని మండలాలు కవరయ్యేలా యువగళం యాత్రను ప్లాన్ చేశారు. అదేవిధంగా.. అన్ని వర్గాల ప్రజలతోనూ ఇక్కడ కూడా నారా లోకేష్ భేటీ కానున్నారు. దీంతో స్థానిక నాయకులు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలావుంటే, లోకేష్ పాదయాత్ర మంగళగిరిలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో దీనిపై వైసీపీ నాయకు లు.. డేగ కన్ను సారించినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు.. పాదయాత్రపై దృష్టిని మళ్లించాలనేది వైసీపీ నాయకుల ప్లాన్. ఈ క్రమంలోనే స్థానికంగా పాదయాత్ర సాగినన్ని రోజులు.. ప్రభుత్వ కార్యక్రమాల తో ఇక్కడ హడావుడి చేసి.. వారిని తమవైపు తిప్పుకొనే వ్యూహంలో ఉన్నారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట.
అదే సమయంలో పాదయాత్రకు ఏయే ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు పాల్గొంటున్నారు? స్థానికంగా ఎంతమంది పాల్గొంటున్నారు? అనే లెక్కలు కూడా తెలుసుకుంటున్నారట. దీనిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వైసీపీలో ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం.మొత్తంగా చూస్తే.. మంగళగిరిలో పాదయాత్రను సక్సెస్ చేయాలని టీడీపీ, ఏదో ఒకరకంగా విఫలం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తున్నాయ నేది స్థానికంగా జరుగుతున్న చర్చ. మరి ఏం జరుగుతుందో చూడాలి.