వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే స్థానాలలో కదిరి నియోజకవర్గం ఖాయంగా ఉంటుందని అంటున్నారు టీడీపీ నాయకులు. దీనికి కారణం.. టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండడమేనని చెబుతున్నారు. 2009లో భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్న కందికుంట.. ఈ సారి తప్పకుండా గెలుస్తారని.. స్థానికంగా ఒక చర్చ అయితే సాగుతోంది. పైగా వరుసగా రెండు సార్లు ఓడి పోవడంతో ఆయనపై సింపతీ కూడా పెరిగిందని అంటున్నారు.
రాజకీయంగానే కాకుండా… సామాజిక కార్యక్రమాల్లోనూ కందికుంట ముందుంటున్నారు. ప్రజలకు ఎప్పు డు ఏ అవసరం వచ్చినా.. ఆయన నేనున్నానంటూ కదులుతున్నారు. పార్టీలు, వర్గాలు, కుల, మతాలతో సంబంధం లేకుండా ఆయన సొంతంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలను ఆదుకుంటూ ఉంటారు. ఈ పరిణామమే ప్రజలకు-కంది కుంటకు మధ్య బలమైన బంధాన్ని పెంచింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. కందికుంట ఈ బందాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.
ఇక, గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్న పివి. సిద్దారెడ్డికి సొంత ఇంట్లోనే సెగ తగులుతోంది. తనవారే ఆయనకు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు. గత ఎన్నికల సమయంలో ఆయనకు జై కొట్టినా.. ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకోలేదని.. తమకు ఏమీ చేయడం లేదని.. వైసీపీలో రెడ్డి వర్గం తీవ్ర ఆవేదనతో ఉంది. పైగా.. కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయని, దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆవేదన వైసీపీ వాళ్లలోనే ఉంది. దీంతో సొంత కేడర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారిపోయింది.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. మరోవైపు.. టీడీపీ దూకుడు పెరిగింది. కందికుంట ప్రజలను కలుసుకోవ డంతోపాటు.. పోలీసు కేసులకు వెరవకుండా.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా.. నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు. ఇటు పలు సర్వేల్లో కూడా ఈ సారి టీడీపీ డ్యామ్‌షూర్ విన్నింగ్ సీట్లలో కదిరి ఫస్ట్ ప్లేసులోనే కనిపిస్తోంది.
ఇటీవల చంద్రబాబు కదిరి పర్యటనలో సైతం గత ఎన్నికలకు ముందులా టెన్షన్ లేకుండా కందికుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని క్లారిటీ ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో పాటు కందికుంట అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. కందికుంట పేరు చెప్పగానే ఒక్కసారిగా వెయ్యి ఓల్టుల బల్పు వెలుగుతున్నట్టుగా కదిరి టీడీపీ కేడర్ ముఖాలు వెలిగిపోయాయి. ఏదేమైనా ఈ సారి కదిరి టీడీపీ కేడర్‌లో చాలా కసి కనిపిస్తోంది. ఇదే కందికుంటను విజయం వైపుగా పయనించేలా చేస్తోంది.