నెల రోజుల ముందే బెయిన్‌స్ట్రోక్ ఇలా గుర్తించొచ్చా…!

ఇటీవ‌ల‌ చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ కి గురై చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఈ సమస్య రాకముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక‌సారి చూద్దాం. మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో వచ్చే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోవచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు?
బ్రెయిన్ స్ట్రోక్‌ని సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ ఇలా మూడు రకాలుగా గుర్తించవచ్చు.

ఐస్కీమిక్ స్ట్రోక్:
మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోయినా సందర్భంలో వచ్చే స్ట్రోక్ ని ఐస్క్రీమ్ స్ట్రోక్ గా పిలుస్తారు.

హీమోర్హజిక్ స్ట్రోక్:
మెదడు రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్త శ్రవణం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి.

ట్రాన్సియంట్ ఐస్కీమిక్ స్ట్రోక్:
ఉన్నట్టుండి రక్త క‌ణాల‌ సరఫరా ఆగిపోతుంది. మళ్లీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. దీనినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఒక రకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని విర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్ ను అడ్డుకోవచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు:
• ఏ రక్తమైన స్ట్రోక్ వచ్చిన ముందుగా తలనొప్పి వస్తుంది.హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి. కరోటిడ్ ఆర్టరీ నుంచి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓవైపుకి వంగిపోవడం, రెండు చేతులు పైకి లేగకపోవడం, ఓ చెయ్యి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి లక్షణాలు.

• అలాగే చాతి నొప్పి, శ్వాసను సమస్యలు ఉంటాయి.

• ఎక్కిళ్ళు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. 10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్ళు ఎక్కువగానే వస్తాయని గుర్తించారు.

మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు లక్షణాలు:
• ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చుని నిపుణులు తెలియజేశారు.

• అలాగే వికారం, వాంతులు.. మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా ఇలా వస్తూ ఉంటాయి.

• ఇక చూపులో సమస్యతో పాటు బ్రహ్మ పడుతున్నట్లు కూడా అనిపిస్తుందట.

•తలనొప్పి బాగా రావడం, నీరసం, నడవలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

•ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.