ఔను.. ఈ రేంజే వేరు.. ఇప్పటి వరకు జరిగిన యాత్ర ఒక ఎత్తు.. ఇక్కడ సాగే యాత్ర మరో ఎత్తు! అంటున్నా రు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెద్దకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ నాయకులు. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను పూర్తి చేసుకుని.. ఉమ్మడి గుంటూరులో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికలకు మరో 8 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ యువగళం పాదయాత్రను స్థానిక నా యకులు.. సీనియర్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో వారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తు న్నారు. యువనేత పాదయాత్ర సూపర్ హిట్ కొట్టేలా వారు ముందుకు సాగుతున్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న సీమ జిల్లాల్లోనే యువగళానికి భారీ మద్దతు లభించింది. ప్రజలు ఎక్కడికక్కడ ఎదురేగి మరీ నారా లోకేష్‌కు స్వాగతం పలికారు.
ఇక, పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యువగళం పాదయాత్రను హిట్ చేశారు. ఇక, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వచ్చే సరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. టీడీపీకి మంచి పట్టున్న జిల్లా కావడంతో ఇక్కడ పాదయాత్రకు పెద్ద ఎత్తున నాయకులు తరలి వచ్చారు. ఇసకేస్తే.. రాలనంతగా జనం తరలి వచ్చారు. తర్వాత అద్దంకి నియోజకవర్గంలో సాగిన యాత్ర.. నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. ఏ నేతకు రానంత ప్రజలు వచ్చారు.
ఈ క్రెడిట్ అంతా కూడా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికే చెందుతుంది. ఆ తర్వాత.. గుంటూరులోకి ప్రవేశించిన తర్వాత.. వినుకొండ, మాచర్లలో దుమ్మురేగిపోయింది. యువగళానికి వచ్చిన జనాభాతో రోడ్లు కుంగిపోతాయా? అన్న విస్మయం వ్యక్తమైంది. ఎక్కడి నుంచి వచ్చారో.. ఎలా వచ్చారో తెలియదు కానీ.. భారీ ఎత్తున తరలి వచ్చారు. ఇక, ఇప్పుడు గురజాల నుంచి పెదకూరపాడులో కి ఈ యాత్ర అడుగులు వేయనుంది.
ఈ నేపథ్యంలో ఈ యాత్ర దూకుడు అలాగే కంటిన్యూ చేసేందుకు… ఆ గ్రాఫ్ అలాగే రైజ్ చేసేలా ఉంచేందుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎంతో శ్రమిస్తున్నారు. కూరపాడు టీడీపీ కేడర్ కూడా లోకేష్ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కసితో ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన యాత్రకు భిన్నంగా ఇక్కడ మరింత రేంజ్ ఉండాలని ఆశిస్తున్నారు.