హిరో నాని.. 26వ సినిమాకు కొట్టాడు బోణి

నేచుర‌ల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. వ‌రుస‌గా త‌న సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఒక‌దాని త‌ర్వాత మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాడు. త‌న అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్న త‌న 25 చిత్రాన్ని మొద‌లు పెట్టిన నాని తాజాగా త‌న 26వ‌ సినిమాకు కూడా క్లాప్ కొట్టాడు. నిన్నుకోరి సినిమా ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్‌ను లాంఛ‌నంగా ప్రారంభించాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇంత‌కుముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నానితో జంట‌గా నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తిస సినిమా ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండ‌గా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వ‌రాల‌ను సమకూర్చుతున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరో జగపతిబాబు ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా  నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ వంటి ప్ర‌ముఖ న‌టులు కూడా ఈ సినిమాలో నటిస్తుండ‌డంతో చిత్రంపై అంచ‌నాలు  అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి.

Tags: jagapathibabu, Nani, reethu varma, shiva nirvaana, Tuck Jagadish