సుమారు రెండేళ్ల విరామం తరువాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తున్నారు హిరో పవన్‌కల్యాణ్. వరుసగా ఒక్కో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. అందులో ప్యాన్ ఇండియా స్థాయిలో , భారీ బడ్జెట్‌తో దర్శకుడు జగర్లముడి క్రిష్ తెరకెక్కిస్తున్న ఓ పిరియాడికల్ డ్రామా చిత్రంలో షూటింగ్‌ను సైతం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల ఎంపికలో ఆ దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నాడు. పలువురు బాలీవుడ్‌తో సహా ఇతర సినీ పరిశ్రమలకు చెందిన దిగ్గజ నటులతో సంప్రదింపులను జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇప్పటికే బాలివుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న పింక్ తెలుగులో పవన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. దిల్ రాజు, బాలివుడు నిర్మాత బోనీకపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రీమెక్ చేస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో అమితాబ్‌బచ్చన్ పోషించిన కీలక న్యాయవాది పాత్రను పవన్‌కల్యాణ్ పోషిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసం కేవలం 25 రోజులను మాత్రమే కాల్షిట్లను ఇవ్వగా, చిత్రీకరణలో పవన్ సైతం పాల్లొంటున్నాడు. అయితే ఈ చిత్రం కోసం పవన్ రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఏకంగా రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతున్నది. అయితే అది షేర్ రూపంలోనని తెలుస్తున్నది. పవన్ రీ ఎంట్రీ సినిమా కచ్చితంగా రూ. 130 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తుందని, అదీగాక అజ్ఞాతవాసి ప్లాపయినా తొలిరోజే రూ.40 కోట్ల షేర్ తీసుకొచ్చిందని, అందుకే అందుకు నిర్మాతలు అందుకు ఒప్పుకున్నట్లు టాలివుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ పింక్ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.