న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ దసరా (Dasara). సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే అదరగొట్టిన నాని ఈ సినిమాతో మాస్ అవతారం ఎత్తాడు.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు చిత్రయూనిట్. నాని దసరా (Dasara) సినిమా 2023 మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య తెలుగు సినిమాలు అన్ని హిందీ మార్కెట్ లో సత్తా చాటుతున్న కారణంగా నాని దసరా సినిమాని కూడా హిందీలో గ్రాండ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన దసరా ఏమేరకు సత్తా చాటుతుందో చూడాలి. రీసెంట్ గా అంటే సుందరానికీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే దసరా మాత్రం అంచనాలను మించి ఉంటుందని చెబుతున్నారు.