సినిమాలో తన నుంచి తన అభిమానులు, ప్రేక్షకులు ఏది కోరుకుంటారో నందమూరి నట సింహం బాలకృష్ణ కు తెలిసిన విధంగా మరో హీరోకు తెలియదు. తన కోసం వచ్చే ప్రేక్షకుల కోసం బాలకృష్ణ ఎక్కువగానే కష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న సన్నివేశాల్లో కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తారు బాలకృష్ణ. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమాలో బాలకృష్ణ నటన, డాన్స్ పై ఇప్పుడు ఫాన్స్ సంతోషంగా ఉన్నారు. కొన్ని పాటల్లో బాలకృష్ణ డాన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 60 ఏళ్ళ వయసులో బాలకృష్ణ స్టెప్పులు పూనకం తెప్పించాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మిమ్మల్ని ట్రోల్ చేసే వారు ఒక్కసారి వీటిని చూసి అప్పుడు మాట్లాడాలని, ఈ విధంగా మరో హీరోకి సాధ్యం అయ్యే పని కాదని సోషల్ మీడియాలో బాలయ్యని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక ఈ సినిమా చూసిన కొందరు యువ హీరోలు కూడా బాలయ్య స్టెప్పులు చూసి ఫిదా అయిపోయారు. తమకు కనీసం కాళ్ళు కూడా ఒంగడం లేదని, కాని బాలయ్య మాత్రం ఆ విధంగా దుమ్ము రేపుతున్నారని సినిమా చూసిన ఒక హీరో వ్యాఖ్యానించారట. బాలయ్య దగ్గర నటనే కాదు డాన్స్ లు కూడా నేర్చుకోవాలని, ఆయన స్టెప్పులు చూస్తే డాన్స్ మాస్టర్లకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయని. కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా బాలయ్య దుమ్ము రేపారని అంటున్నారు.