న‌గ్మా ప్రేమికుల లిస్ట్ చాలా ఉందే… వామ్మో ఏం ట్విస్టులో…!

ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుత రాజకీయ నాయకురాలు నగ్మా ఒకప్పుడు చిత్రసీమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలలో ఆమె నంబర్ 1గా ఒకానొక సమయంలో కొనసాగింది. సల్మాన్ ఖాన్ సరసన బాఘీ – ఎ రెబెల్ ఫర్ లవ్‌ సినిమాలో తొలిసారిగా నటించింది. ఈ చిత్రం 1990లో అత్యధిక వసూళ్లు సాధించిన 7వ చిత్రంగా నిలిచింది.

 

అక్కడి నుండి ఆమెకు అనేక మంచి ఆఫర్లు రావడం ప్రారంభించాయి. క్రమంగా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలోనూ అదృష్టం పరీక్షించుకుని విజయవంతమైంది. ఆమె సినీ జీవితం బాగున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, కొందరు సినీ ప్రముఖులతో ఆమె ప్రేమ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలొచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్ సినిమాలతో పాటు బెంగాలీ సినిమాలలోనూ నగ్మా నటించింది. బెంగాలీ వ్యక్తి, స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ఆమె ప్రేమలో పడింది. అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లైంది. డోనా జోక్యంతో గంగూలీతో ఆమె ప్రేమ బంధానికి తెరపడింది. ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి వరకు వెళ్లారు. సౌరవ్ గంగూలీతో విడిపోయిన తర్వాత, ఆమె తమిళ నటుడు శరత్ కుమార్‌తో ప్రేమలో పడింది.

Nagma Movies, Bio, Height, Weight, Husband Name, Age & Image

శరత్ కుమార్ నటుడు, ఎంపీ. వీరి వ్యవహారం తెలియడంతో శరత్ కుమార్ భార్య అతడికి విడాకులు ఇచ్చింది. కొన్నాళ్లకే నగ్మాతో శరత్ కుమార్‌కు విబేధాలు వచ్చాయి. ఆ సమయంలో ఆమెను శరత్ కుమార్ తీవ్రంగా బెదిరించారనే వార్తలొచ్చాయి. ఈ ఘటన నగ్మాను దక్షిణాదిలో తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలికేలా చేసింది. తర్వాత భోజ్‌పురి చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది.

Nagma (Actress) Height, Weight, Age, Affairs, Biography & More » StarsUnfolded

ఆ సమయంలో భోజ్ పురి స్టార్ నటుడు రవి కిషన్‌తో ప్రేమలో పడింది. అయితే రవి కిషన్‌తో సంబంధాన్ని నగ్మా ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఈ విషయాన్ని రవి కిషన్ పలు సందర్భాలలో బయటపెట్టాడు. అప్పటికే రవి కిషన్‌కు పెళ్లైంది. చివరికి రవి కిషన్ భార్యకే దగ్గరయ్యాడు. దీంతో వీరి ప్రేమ కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది.

When Nagma Broke Silence On Her Alleged Affair With Sourav Ganguly & Their Break Up: “There Was A Career At Stake, Besides Other Things..."

రవి కిషన్‌తో చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత మరో భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీతో ప్రేమలో పడింది. దీనిని ఇద్దరూ ఖండించారు. అయినప్పటికీ వీరి ప్రేమ గురించి అప్పట్లో సినీ వర్గాల్లో చర్చలు సాగేవి. వీరి బంధం కూడా కొన్నాళ్లకే ముగిసింది. ఇలా పెళ్లైన నలుగురు ప్రముఖులతో ఆమె ప్రేమాయణం సాగించినా, చివరికి ఆమె ఏకాకిగా మిగిలిపోయింది.

Tags: actor nani, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news