క‌మ‌ల్ హాస‌న్‌కు భార్య కావాల్సిన శ్రీ‌దేవి.. వీరిద్ద‌రి పెళ్లికి అడ్డుప‌డిందెవ‌రు…?

ఆన్ స్క్రీన్ పై సూప‌ర్ హిట్ అయిన జోడీల్లో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్, అతిలోక సుంద‌రి శ్రీదేవి జంట ఒక‌టి. వీరిద్ద‌రూ క‌లిసి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఎన్నో సినిమాల్లో న‌టించారు. వాటిల్లో ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఒక రాధా ఇద్దరు కృష్ణులు త‌దిత‌ర సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. వెండితెర‌పై క‌మ‌ల్ హాస‌న్‌, శ్రీ‌దేవి కెమెస్ట్రీకి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయేవారు.

We hid the truth: Kamal Haasan reveals the true nature of his relationship  with Sridevi

అంతేకాదు త‌మిళ‌నాట క‌మ‌ల్ హాస‌న్‌, శ్రీ‌దేవి జోడీగా స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అంత‌లా వీరిద్ద‌రూ తెర‌పై మ్యాజిక్ చేశారు. ఇక వీరి జంట‌ను చూసి అభిమానులు నిజ జీవితంలోనూ క‌మ‌ల్ హాజ‌న్ కు శ్రీ‌దేవి భార్య అయితే భాగుండ‌ని భావించేవారు. పైగా శ్రీదేవి కుటుంబంతో క‌మ‌ల్ హాసన్ ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ట‌.

Sadma's lullaby haunts me now: Kamal Haasan mourns Sridevi's death |  Celebrities News – India TV

త‌మ ఫ్యామిలీతో స‌న్నిహితంగా ఉండ‌టం, జంట కూడా చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించ‌డంతో ఓ రోజు శ్రీదేవి త‌ల్లి త‌మ కూతురుని పెళ్లి చేసుకోమ‌ని క‌మ‌ల్ హాస‌న్ ను కోరింద‌ట‌. కానీ, శ్రీ‌దేవిని పెళ్లి చేసుకునేందుకు క‌మ‌ల్ హాస‌న్ నో చెప్పార‌ట‌. అందుకు ప్రధాన కారణం.. శ్రీదేవిని కమల్ సోదరిగా భావించడ‌మే. తాను శ్రీదేవిని తోబుట్టువులా భావించేవాడిని.. త‌న‌కెప్పుడు శ్రీదేవిని పర్సనల్ లైఫ్ లోకి తీసుకోవాలని అనుకోలేదు.

Sridevi: Kamal Haasan and Sridevi in the Tamil film Neela Malargal (1979)

శ్రీదేవి కూడా త‌న‌ను సార్ అని పిలిచేది. తను నాకు ఎంతో గౌరవం ఇచ్చేది. అందువ‌ల్ల‌ ఆమెను పెళ్లి చేసుకోలేన‌ని క‌మ‌ల్ హాస‌న్ చెప్పార‌ట‌. ఆ మాట‌తో శ్రీ‌దేవి త‌ల్లి మౌనంగా ఉండిపోయార‌ట‌. ఈ విషయాన్ని కమల్ హాసన్ గ‌తంలో స్వయంగా వెల్ల‌డించారు. మొత్తానికి అలా నిజజీవితంలో కమల్, శ్రీదేవి ఒక్కటి కాలేకపోయారు.

Tags: actor Kamal Haasan, film news, filmy updates, intresting news, kamal haasan, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news