టాలీవుడ్‌లో ఈ హీరోల‌కు పెళ్లి యోగం లేదా… వీరి జీవితం ఇంతేనా…!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లి అనే మాట ఎంతో ట్రెండింగ్ లో ఉంది. ఇక‌ 30 ఏళ్ళు వయసు వచ్చిన పెళ్లి మాట ఎత్తని టాలీవుడ్‌లో హీరోలు ఎవరెవరు ఉన్న‌రు ఒకసారి తెలుసుకుందాం. ఇక రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి యంగ్ హీరో శర్వానంద్ తప్పుకున్నాడు. రీసెంట్ గానే శర్వానంద్ రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇక ఎప్పుడూ మరో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి.

Allu Sirish - Wikipedia

అయితే పెళ్లి అనే ఆలోచన లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న బడా హీరోలు మాత్రం ఎంతోమంది ఉన్నారు. టాలీవుడ్ లో బ్యాచిలర్ అనే పదంంటే గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ప్ర‌స్తుతం ఉన్న యంగ్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ వయస్సు అందరికంటే చాలా ఎక్కువ. ఇక ప్రభాస్ పెళ్లి గురించి గంటకో వార్త వస్తూనే ఉంది. కానీ అందులో ఏ వార్త నిజం అవటం లేదు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా మిగిలిపోయాడు.

Tollywood Drug Case Reaches Its Final Phase With Tarun Kumar Brought In For  Questioning

అంతేకాకుండా చివరకు ప్రభాస్ పెళ్లి తర్వాత తన పెళ్లి అని చెప్పిన శర్వానంద్‌ కూడా ఓ ఇంటివాడు అయిపోయాడు. ఆది పురుష్‌ సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా పెళ్లి గురించి ప్రభాస్ సమాధానం ఇస్తు తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాని హామీ ఇచ్చాడు. కానీ ఆరోజు ఎప్పుడు వస్తుందో అనేది ఎవరో చెప్పలేం ఇక ఇప్పుడు ఇదే లిస్టులో మరో మెగా హీరో సాయి ధరంతేజ్ కూడా ఉన్నారు. తనకంటే చిన్న వారంతా పెళ్లి చేసుకుంటున్న కూడా ఈ హీరో పెళ్లి మాట ఎత్తకపోవడంతో అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

Akhil Akkineni turns 26, Tollywood wishes pour in for the Most Eligible  Bachelor actor | Telugu Movie News - Times of India

తెలుగులో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రామ్.. టాలీవుడ్ లో అడుగుపెట్టి పుష్కరకాలం దాటుతున్న పెళ్లిపై తన అభిప్రాయం ఇప్పటికీ బయటికి చెప్పడం లేదు రామ్. ఇదే లిస్టులోకి వస్తారు విజయ్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్, తరుణ్, అఖీల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాచిలర్ లిస్ట్ పెద్దగానే ఉంది. వీరిలో అడివి శేష్‌ మాత్రం అక్కినేని మేనకోడలు సుప్రియ తో డేటింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

I had a culture shock when I first returned to India: Adivi Sesh - Times of  India

మిగిలిన హీరోలు మాత్రం పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. మరి ఈ హీరోలు మాత్రం అసలు పెళ్లి చేసుకుంటారా ఇలానే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆవయసులో జరుగుతూనే అందరికీ బాగుంటుంది. ఈ హీరోలందరూ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళయితే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.