Nagarjuna : నాగార్జున ది ఘోస్ట్ కి సెన్సార్ షాక్..!

Nagarjuna : కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న సినిమా ది ఘోస్ట్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటించింది. నాగార్జున మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుంది.

ఇక ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. అంతేకాదు ది ఘోస్ట్ సినిమా చూసి సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమాలో నాగ్ స్టైలిష్ యాక్షన్ ఫ్యాన్స్ కి నచ్చేస్తుందని అంటున్నారు. కొన్ని సినిమాలు సెన్సార్ టైం నుంచే పాజిటివ్ బజ్ తెచ్చుకుంటాయి. నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు కూడా అదే పాజిటివ్ బజ్ వచ్చింది.

అయితే అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు సీనియర్ హీరోల ఫైట్ షురూ అవుతుంది. అయితే నాగార్జున మాత్రం తన సినిమా మీద ఫుల్ కాన్ ఫి డెంట్ గా ఉన్నాడు. గరుడవేగ ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ ని చాలా క్లవర్ గా తెరకెక్కించాడని అంటున్నారు. బంగార్రాజు సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ్ ఈ సినిమాతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.

Tags: nagarjuna, Nagarjuna Movie, Praveen Sattaru, Sonali Chauhan, The Ghost, The Ghost Censor Talk