Mohan Babu : మహేష్ సినిమాలో మోహన్ బాబు..?

Mohan Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఓ భారీ యాక్షన్ సీన్ తో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అయితే బుధవారం మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడం వల్ల సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. మహేష్ రెండు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు టాక్. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో కాస్టింగ్ గురించి న్యూస్ బయటకు వచ్చింది.

ఇప్పటికే సినిమాలో పూజా హెగ్దే ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తుందని చెబుతున్నారు. జాతిరత్నాలు ఫేం ఫరియాకి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక మరోపక్క సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నారని టాక్. మహేష్ సినిమాలో మోహన్ బాబు ఇది నిజంగానే క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు.

మహేష్ త్రివిక్రం ఇప్పటి వరకు తీసిన రెండు సినిమాలు అతడు, ఖలేజా ఒక మార్క్ సెట్ చేశాయి. అయితే ఈ హ్యాట్రిక్ సినిమాతో మరో సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నారు. 2023 ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా 2023 ఫస్ట్ హాఫ్ లో మొదలవుతుందని తెలుస్తుంది. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌళి.

Tags: mahesh, mahesh babu, SSMB28, Superstar Mahesh, trivikram