Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరపురంలో జరుగుతుండగా చిత్రయూనిట్ సమక్షంలో ఈ ట్రైలర్ రిలీజ్ జరిగింది. ఇక ఈ ట్రైలర్ చూస్తే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు రావడం పక్కా అనిపించేలా ఉంది. మళయాళ లూసిఫర్ మూవీని చాలా మార్పులు చేసి కొత్తగా గాడ్ ఫాదర్ సిద్ధం చేశారు. ఈ సినిమాలో చిరు క్లాస్ అండ్ మాస్ లుక్ అదిరిపోయింది.
ఇక మెగా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉనాయని అర్ధమవుతుంది, ఆచార్య సినిమాలో చిరుని చూసి డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి గాడ్ ఫాదర్ ఫుల్ మీల్స్ పెట్టే సినిమా అయ్యేలా ఉంది. గాడ్ ఫాదర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. పూరీ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఇక సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉన్నాడని చెప్పొచ్చు.
థమన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యేలా ఉంది. నయనతార మరోసారి తన నటనతో మెప్పించేలా ఉన్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ మెగా గాడ్ ఫాదర్ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.