సూర్య ‘ కంగువా ‘ అ టాలీవుడ్ హిట్ సినిమాకు కాపీనా.. ఇదేం ట్విస్ట్ రా సామి..?

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘ గజిని ‘ సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఆక‌టుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం సూర్య ‘ కంగువా ‘ అనే భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

ప్ర‌స్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో ఇదివరకు హిట్ అయినా ఓ సినిమా కథకు కాపీ అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌లో చూపించిన విధంగా సీన్స్ మాత్రం ఫ్లాష్ బ్యాక్‌లో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగే సన్నివేశాలట. ప్రజెంట్ టైం తో పాటు గతంలో జరిగిన కొన్ని సంఘటనల నుంచి ‘ కంగువా ‘ ను రూపొందించారట.

హీరో గత జన్మలో క్రూరమైన రాజుల ఉంటాడని అయితే ప్రస్తుత కాలానికి వస్తాడని ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇది సేమ్ వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన‌ ‘ బింబిసారా ‘ సినిమా క‌థ‌లా అనిపించ‌టంతో కంగువ ఈ సినిమాకి కాపీ అంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.