Nagarjuna : నాగార్జునని ఏడిపించిన శర్వానంద్.. అమలని హగ్ చేసుకుని మరీ..!

కింగ్ నాగార్జున (Nagarjuna)ని ఏంటి శర్వానంద్ ఏడిపించడం ఏంటని అనుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా కోసం స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. అమల నటించింది కాబట్టి ఈ స్పెషల్ ప్రీమియర్ షోకి నాగార్జున కూడా అటెండ్ అయ్యారు. అఖిల్ తో పాటుగా తెలుగు యంగ్ డైరక్టర్స్ అంతా కూడా ఈ స్పెషల్ ప్రీమీర్ షోలో పాల్గొన్నారు.

అయితే ఈ ప్రీమియర్ షో చూసిన తర్వాత నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. టైం ట్రావెల్ కథతో మదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఒకే ఒక జీవితం సినిమా నాగార్జున చూసి బాగా ఎమోషనల్ అయ్యారు. ఎంతగా అంటే ఆయన సినిమా చూసి తన మదర్ అన్నపూర్ణమ్మ గారిని గుర్తు చేసుకున్నారట. సినిమా చూసిన వెంటనే శర్వానంద్ కి హగ్ ఇచ్చారు Nagarjuna. అంతేకాదు అమల చేసిన పాత్ర అద్భుతంగా ఉండటంతో అమలని కూడా హగ్ చేసుకున్నారు.

నాగార్జున మాములుగా ఎప్పుడూ ఈ రేంజ్ లో ఎమోషనల్ అవడం చూడలేదు. మరి సినిమాలో అంత మ్యాజిక్ ఉంది కాబట్టే నాగ్ అలా ఎమోషనల్ అయ్యారని చెప్పొచ్చు. అంతేకాదు స్పెషల్ ప్రీమియర్ తో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్ ఖాతాలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.

 

Tags: nagarjuna, Oke Oka Jeevitam, Reetu Varma, Sharwanand, Sri Karthik, Tollywood